: కాంగ్రెస్ పార్టీ మృతజీవి కాదు... సంజీవని: చిరంజీవి


కాంగ్రెస్ పార్టీ మృతజీవి కాదని... సంజీవని అనీ కాంగ్రెస్ ముఖ్యనేత చిరంజీవి అన్నారు. చిరంజీవి చేరికతో కాంగ్రెస్ పార్టీ మృత జీవిగా మారిందని బీజేపీ నేత వెంకయ్య నాయుడు చేసిన విమర్శలను చిరంజీవి తిప్పికొడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాభిమానంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సంజీవనిగానే ఉంటుందని చిరంజీవి చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సామాజిక న్యాయం ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, టికెట్ల కేటాయింపులో ఈ విషయం తేటతెల్లమయిందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం నేతిబీరకాయలో నెయ్యి వంటిదని చిరంజీవి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News