: రూ.2,025 కోట్లు చెల్లించి భారతితో రిటైల్ బంధానికి స్వస్తి


భారతీ వాల్ మార్ట్ రిటైల్ చైన్ నుంచి వైదొలగేందుకు వాల్ మార్ట్ 33.4కోట్ల డాలర్లు (రూ.2,025కోట్లు) చెల్లించుకుంది. వాల్ మార్ట్, భారతీ సంయుక్తంగా కొన్నేళ్ల క్రితం భారతీ వాల్ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఏర్పాటు చేయగా, గతేడాది రెండూ తమ భాగస్వామ్యానికి ముగింపు పలికాయి. ఇందులో భారతీకి ఉన్న వాటాకు గాను వాల్ మార్ట్ 10 కోట్ల డాలర్లు చెల్లించింది. ఇక రుణాలు, పెట్టుబడుల కోసం 23.4 కోట్ల డాలర్లు సమర్పించుకుంది. ఈ మొత్తంలో వాల్ మార్ట్ కు నికరంగా 15.1 కోట్ల డాలర్లు నష్టం వచ్చింది. ఈ వివరాలను వాల్ మార్ట్ తన వార్షిక నివేదికలో ప్రస్తావించింది. భారతీ వాల్ మార్ట్ దేశవ్యాప్తంగా 20 హోల్ సేల్ స్టోర్లను నిర్వహిస్తోంది.

  • Loading...

More Telugu News