: తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టిస్తా: దానం
తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో ఏర్పడిన తరువాత కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టిస్తానని మాజీ మంత్రి దానం నాగేందర్ హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వంద కోట్ల రూపాయలకు ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎండీ అల్లుడికి టికెట్ ఇచ్చిన కేసీఆర్ తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తాడంటూ ప్రశ్నించారు. 'మరోసారి సోనియా గాంధీపై నోరుజారితే ఖబడ్దార్' అంటూ దానం కేసీఆర్ ను హెచ్చరించారు. దొరల అహంకారంతో కేసీఆర్ బీసీలను, దళితులను కించపరుస్తున్నాడని ఆయన మండిపడ్డారు.