: హోమోలపై కత్తిగట్టిన పాకిస్థానీ సీరియల్ కిల్లర్
పాకిస్థాన్ లోని లాహోర్ లో స్వలింగ సంపర్కులకు ఇప్పుడు వెన్నులో వణుకు పుడుతోంది. దీనికి కారణం మొహమ్మద్ ఇజాజ్ అనే వ్యక్తి వరుసగా హోమోలను హత్య చేస్తున్నాడు. అతడి చేతిలో ఇప్పటికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఎట్టకేలకు అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వివాహితుడైన 28 ఏళ్ల ఇజాజ్ తాను ముగ్గురిని హత్య చేసినట్లు అంగీకరించాడు. హోమోసెక్సువాలిటీ దురాచారంపై సందేశాన్ని పంపడానికే ఇలా చేశానని, దీనికి అంతం పలకాలన్నాడు. అయితే, హోమోసెక్సువాలిటీని నేరంగా పరిగణించే ముస్లిం సమాజంలో మత పెద్దలు ఇజాజ్ చర్యను సమర్థిస్తున్నారు.