: అనంతపురం ఎస్పీపై సీఈసీకి సీఎం రమేష్ ఫిర్యాదు


అనంతపురం జిల్లా ఎస్పీపై ఎంపీ సీఎం రమేష్, కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కడపలో ప్రతి ఎన్నికల్లోనూ ఒకే పార్టీకి అనుకూలంగా 75 శాతం ఓట్లు నమోదవుతున్నాయని తెలిపారు. పులివెందుల, లింగాాల, జమ్మలమడుగుల్లో పోలింగ్ ఏకపక్షంగా సాగుతుందని, ప్రజాస్వామ్యపధ్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News