: ఆమరణ దీక్షకు దిగుతోన్న విజయమ్మ


పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమరశంఖం పూరించారు. ఈ విషయమై ప్రభుత్వం దిగివచ్చేవరకూ ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ ఆదర్స్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రేపు విజయమ్మ ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటారు.  కొంచెం సేపటిక్రితం జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
ఇదిలా ఉంటే, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గులాం నబీ అజాద్ విద్యుత్ సమస్య విషయమై సీఎంతో ఫోన్లో మాట్లాడటం, అనంతరం ఛార్జీల తగ్గింపుకు సీఎం చర్యలు తీసుకుంటానని చెప్పిన నేపథ్యంలో విజయమ్మ ఆమరణ నిరాహారదీక్షకు దిగడం గమనార్హం. 

  • Loading...

More Telugu News