: ఆర్టీసీని ఆదుకుంటాం: బొత్స
కష్టాలలో ఉన్న ఆర్టీసీకి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోని బస్సు భవన్లో ఆయన మాట్లాడారు. డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో సంస్థపై భారం పడకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీకి భవిష్యత్తులో మరింత చేయూతనందిస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బొత్సను ఎంప్లాయీస్ యూనియన్ నేతలు సన్మానించారు.