: నా పేరుతో ఫేస్ బుక్ ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశారు: ‘మొగిలిరేకులు’ హీరో


తన పేరుతో ఓ వ్యక్తి ఫేస్ బుక్ ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి మోసాలకు పాల్పడుతున్నాడని ‘మొగిలిరేకులు’ టీవీ సీరియల్ హీరో సాగర్ హైదరాబాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మాదాపూర్ సీఐ నర్సింహులు మీడియాకు తెలిపారు.

ఖమ్మం జిల్లా కొల్లూరు వాసి గోపీనాథ్ ‘మొగిలిరేకులు’ హీరో సాగర్ పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతాను తెరిచాడు. బీకాం, సెకండియర్ విద్యార్థి అయిన గోపీ ఫేస్ బుక్ ప్రొఫైల్ లో సాగర్ ఫోటో పెట్టాడు. దీంతో అధిక సంఖ్యలో యువతీ యువకుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు రావడంతో... గోపీ వాటినన్నింటినీ కన్ ఫర్మ్ చేశాడు. తానే సాగర్ నాయుడునని చెప్పుకుంటూ... మూడు నెలలుగా చాలా మంది అమ్మాయిలతో ఫోన్ లో, ఆన్ లైన్ ఛాటింగ్ లో మాట్లాడుతున్నాడు. విషయం తెలుసుకున్న హీరో సాగర్ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఐపీసీ 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News