: సంజయ్ దత్ క్రిమినల్, విద్రోహి: ఉమాభారతి
బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పై విరుచుకుపడ్డారు. 1993 ముంబై పేలుళ్ల సమయంలో దేశద్రోహానికి పాల్పడ్డాడని మండిపడ్డారు. అంతేకాదు, సంజయ్ దత్ క్రిమినల్, విద్రోహి అన్నారు. అక్రమాయుధాల కేసులో సంజయ్ దత్ కి క్షమాభిక్ష పెట్టొద్దని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.