: ఒకటే కూటమి, ఒకటే నినాదం, ఒకటే మంత్రం: పవన్ కల్యాణ్


జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిన్న పలు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ, తమది ఒకటే కూటమి బీజేపీ-టీడీపీ-జనసేన అని, ఒకటే మంత్రం అభివృద్ధి అని, ఒకటే నినాదం కాంగ్రెస్ హటావో అని నినదించారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలు కలసి ఉండాలని ఆకాంక్షిస్తూ, బంగారు తెలంగాణ కోసం పాటుపడతానని అన్నారు. గెలిచాక తాను మళ్లీ ఐదేళ్లకు వస్తాడననుకుంటున్నారేమో, తానెక్కడికి వెళ్లనని, అందరి మధ్యా ఉంటానని, మూణ్ణెళ్లకోసారి ప్రతి నియోజకవర్గ సమాచారాన్ని తమ పార్టీ కార్యకర్తల ద్వారా తెలుసుకుంటూనే ఉంటానని అన్నారు. బాధ్యత లేకుండా జాతీయ నేతలను విమర్శిస్తే మౌనంగా చూస్తూ వూరుకోనన్నారు. బంగారు తెలంగాణ రావాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ రావాలని పవన్ అభిలషించారు.

  • Loading...

More Telugu News