: బాక్సర్ విజేందర్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు
ఒలింపిక్ పతాక విజేత బాక్సర్ విజేందర్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విజేందర్ సింగ్, రాంసింగ్ మాదకద్రవ్యాలు తీసుకున్నట్టు తమ విచారణలో తేలిందని పంజాబ్ పోలీసులు నిన్న వెల్లడించిన సంగతి విదితమే. ఈ నేపధ్యంలో క్రీడా మంత్రిత్వ శాఖ కల్పించుకుంది. విజేందర్ మాదకద్రవ్యాలు తీసుకున్నదీ లేనిదీ ధృవపరచడానికి పరీక్షలు చేయాల్సిందిగా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీని కోరింది.