: కేసీఆర్ ను చిత్తుచిత్తుగా ఓడించండి: చంద్రబాబు
సోనియా, మన్మోహన్ లు తెలంగాణ కోసం ఏమైనా చేశారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కేసీఆర్ ను చిత్తుచిత్తుగా ఓడిస్తే తప్ప తెలంగాణ బాగుపడదని అన్నారు. టీఆర్ఎస్ వల్ల కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధికి యువత ముందుకు రావాలని కోరారు. తాను, పవన్ కల్యాణ్ ఇద్దరం ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నామని... కాంగ్రెస్ ను తరిమికొట్టడమే ఆ లక్ష్యమని చెప్పారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని తెలిపారు.