: తెలంగాణ నేతలు బాధ్యతతో వ్యవహరించాలి: పవన్ కల్యాణ్
తనను బూతులు తిట్టినా పట్టించుకోనని... బంగారు తెలంగాణ కోసం ఎన్ని మాటలైనా పడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జాతీయ నేతలను కించపరిచేలా మాట్లాడితే బంగారు తెలంగాణ సాధ్యంకాదని చెప్పారు. పదేపదే జాతీయ నేతలను విమర్శిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పరోక్షంగా కేసీఆర్ కు సెటైర్ విసిరారు. తెలంగాణ నేతలు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. మోడీ ప్రధాని అయితే బంగారు తెలంగాణ వస్తుందని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఈ సభకు చంద్రబాబు కూడా హాజరయ్యారు.