: 60 ఏళ్ల కల నెరవేర్చిన దేవత సోనియా: సబిత
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా... 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన దేవత సోనియాగాంధీ అని మజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆమె రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలందరిపై ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ రోజు చేవెళ్లలో జరిగిన బహిరంగసభలో సబిత ఈ వ్యాఖ్యలు చేశారు.