: మోడీ సీమాంధ్ర పర్యటన ఖరారు
బీజీపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సీమాంధ్ర పర్యటన ఖరారయింది. ఏప్రిల్ 30, మే 1న మోడీ సీమాంధ్రలో పర్యటించనున్నట్టు బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఏప్రిల్ 30న మోడీ తిరుపతి చేరుకుని అక్కడ నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. మే 1న మదనపల్లి, నెల్లూరు, గుంటూరు, నర్సాపురం, విశాఖపట్నంలలో జరిగే సభల్లో మోడీ ప్రసంగిస్తారు. ఈ సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరవుతారు.