: టీఆర్ఎస్ నైజమేమిటో బయటపడింది: సోనియా
ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. సీమాంధ్రులతో తెలంగాణ ప్రజలు స్నేహపూర్వకంగా ఉండాలని కోరారు. తెలంగాణలో మొదటి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ నైజమేమిటో బయటపడిందని... విశ్వసనీయత లేని అలాంటి పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తామని... ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు.