: టాలీవుడ్ లో 'చిలిపి'గా వస్తోన్న 'ఢిల్లీ బెల్లీ'
'ఢిల్లీ బెల్లీ' చిత్రం బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తమిళంలో ఈ చిత్రాన్ని యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థ 'సేట్టయ్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 'చిలిపి' పేరుతో ఎస్ కే పిక్చర్స్ అధినేత సురేష్ కొండేటి తెలుగులోకి అనువదించబోతున్నారు. కన్నన్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో ఆర్య, హన్సిక, అంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నాజర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ సంగీతం.