: సగం వైఎస్ దోచుకున్నారు... మిగతా సగం కోసం జగన్ వస్తున్నారు: ఆనం
గతంలో రాష్ట్రాన్ని సగానికి పైగా వైఎస్ రాజశేఖరరెడ్డి దోచుకున్నారని... మిగిలిన సగాన్ని దోచుకునేందుకు వైకాపా అధినేత జగన్ ఇప్పుడు వస్తున్నారని మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్లపాటు జైలుకు వెళ్లే జగన్ ప్రజలకు ఏమి చేస్తాడని... జగన్ పార్టీ ఓ జైలు పార్టీ అని అన్నారు. జగన్ బ్యాచ్ కోసం అమెరికా జైళ్లు కూడా స్వాగతం పలుకుతున్నాయని ఎద్దేవా చేశారు. జగన్ దురాశకు అనేక మంది బలయ్యారని... అలాంటి వ్యక్తికి ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని కోరారు. ఈ రోజు నెల్లూరు జిల్లా అనంతసాగరంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు.