: బీజేపీ ప్రాణం టీడీపీ చేతిలో ఉంది: ఆజాద్
మాయలపకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు... బీజేపీ ప్రాణం టీడీపీ చేతిలో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చెప్పారు. బీజేపీతో జతకట్టిన టీడీపీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ అయితే, ధనికుల పార్టీ బీజేపీ అని ఆజాద్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి హిందు, ముస్లింలు రెండు కళ్లలాంటివారని చెప్పారు.