: బాలకృష్ణ హృదయంలో నాకు స్థానం ఉంది: పురందేశ్వరి
తన సోదరుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ హృదయంలో తనకెప్పుడూ స్థానం ఉంటుందని రాజంపేట బీజేపీ లోక్ సభ అభ్యర్థి పురందేశ్వరి తెలిపారు. హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి బాలయ్య పోటీ చేస్తున్నారని... అందుకే తన తరపున రాజంపేటలో ప్రచారం నిర్వహించడం లేదని చెప్పారు. నందమూరి ఆడపడుచుగా బాలయ్యకు తన మీద అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని అన్నారు.