: సంస్కారం మరచిన కేసీఆర్... పవన్ కల్యాణ్ పై బూతులు
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న గులాబీ దళపతి కేసీఆర్ తన సంస్కారమేమిటో బయటపెట్టారు. సభ్యసమాజంలో ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి కూడా ఒక చిల్లర వ్యక్తిలా దిగజారి మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా తాండూరులో నిర్వహించిన సభలో ప్రసంగిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సిగ్గు మరచి కామెంట్లు చేశారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే...
"ఎంత ధైర్యమండీ, వాడెవడో సినిమా యాక్టరట. వాడి సినిమానే నేను ఇంతవరకు చూడలేదు. వాడు నిన్న వరంగల్ లో తెలంగాణ గడ్డమీద నుంచొని, 'అరేయ్... కేసీఆర్ నీ తాట తీస్తా' అంటాడా. వీడా... ఒక చిటికె కొడితే వెయ్యి ముక్కలవుతాడు... 'నా కొడుకు' ఏమనుకుంటున్నాడో. తెలంగాణలో నాతాట తీస్తాడంట. నాలుగు రోజులు పోతే ఎవడి తాట ఎవడు తీస్తాడనే విషయం తెలుస్తుంది. చిటికెన వేలంత సినిమా హీరోగాడు... వాడా నా తాట తీసేది?". ఇదండి పవన్ పై కేసీఆర్ చేసిన ఎదురుదాడి!