: కేవీపీపై అరెస్ట్ వారెంట్ కోసం చూస్తున్నాం: డీజీపీ


కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావుపై ఇంటర్ పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు సీఐడీ విభాగానికి అందిందని డీజీపీ ప్రసాదరావు చెప్పారు. అరెస్ట్ వారెంట్ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఈరోజు బషీర్ బాగ్ లో డీజీపీ ప్రసాదరావు మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు వీలుగా పారామిలటరీ బలగాల సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. సమస్యాత్మకంగా ఉన్న 11 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించామని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై నిఘా పెంచినట్లు వివరించారు.

ఇప్పటి వరకూ రూ. 120 కోట్ల నగదు తనిఖీల్లో పట్టుబడిందని, అందులో 40 శాతం నగదును ఆదాయపన్ను విభాగానికి అప్పగించినట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విశాఖ సాగరతీరంలో టైటానియం ఖనిజం కోసం బీచ్ శాండ్ తవ్వకాలకు అనుమతులు ఇప్పించేందుకు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలను కేవీపీ రామచంద్రరావు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బోత్లీ కంపెనీకి అనుమతులు ఇప్పించడంలో కేవీపీ పాత్ర ఉందని అమెరికా ఎఫ్ బీఐ పోలీసులు కేసు నమోదు చేసి ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు పంపారు. అరెస్ట్ వారెంట్ వస్తే కేవీపీ అరెస్టయ్యే అవకాశాలు ఉంటాయి.

  • Loading...

More Telugu News