: జై సమైక్యాంధ్ర పార్టీ మేనిఫెస్టో విడుదల
సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం కీలక పర్వానికి చేరుకున్న తరుణంలో జైసమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేశారు. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వ్యవసాయ పంటలన్నింటికీ బీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు, అలాగే, వ్యవసాయ ఇంజనీరింగ్ పై దృష్టి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ద్వారా వ్యవసాయం కోసం రైతులకు ఆధునిక సాగు యంత్రాలను సమకూర్చడం, బీడు భూముల అభివృద్ధికి అగ్రికల్చరల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ప్రతీ జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, గ్రామీణ పంచాయతీలను మండల పంచాయతీలుగా మార్పు చేసి, పోలీసు, విద్య, ప్రజారోగ్య సేవలను వాటికి అప్పగిస్తామన్నారు. సోలార్ విద్యుత్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. బంగారు తల్లి పథకం ద్వారా పీజీ వరకూ ఉచిత వైద్యం అందించడంతోపాటు ప్రతి జిల్లాలో వృద్ధుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం తదితర అంశాలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు.