: చౌతాలా కేసులో కోర్టు ఆగ్రహం


అక్రమ ఆస్తుల కేసులో హర్యానా ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా (78) తీహార్ జైల్లో ఉన్న సంగతి విదితమే. ఈ ఉదయం ఆరోగ్యం బాగాలేదని చౌతాలా ఫిర్యాదు చేయడంతో జైలు అధికారులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, చౌతాలా ఇవాళ సీబీఐ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో ఉన్నారన్న విషయాన్ని జైలు అధికారులు కోర్టుకు  విన్నవించలేదు. దీనిపై కోర్టు తీవ్రంగా స్పందించింది. చౌతాలా ఆరోగ్య పరిస్థితి మీద నివేదిక ఇవ్వాలని, ఈనెల 12వతేదీన చౌతాలాను కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు.   

  • Loading...

More Telugu News