: దత్తాత్రేయకు మద్దతుగా ప్రచారం చేసిన జేపీ


మొదట్నుంచి మోడీకి మద్దతు పలుకుతున్న లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఈ రోజు మరో ముందడుగు వేశారు. సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న బండారు దత్తాత్రేయకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వారాసిగూడలో ఇద్దరూ కలసి ప్రచారంలో పాల్గొన్నారు. వీరిద్దరి ప్రచారానికి ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుచుకునే 273 స్థానాల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తున్న జేపీ కూడా ఉంటారని చెప్పారు.

  • Loading...

More Telugu News