: సత్యసాయి సమాధిని దర్శించుకున్న బాలకృష్ణ


పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ సందర్శించుకున్నారు. అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ పుట్టపర్తి చేరుకున్న ఆయన నిన్న రాత్రి పుట్టపర్తిలోనే బస చేశారు. ఈ ఉదయం ప్రశాంతి నిలయానికి వెళ్లి బాబా సమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వర్గాలు బాలయ్యకు ఘన స్వాగతం పలికాయి. దర్శనం అనంతరం ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాల వివరాలను ట్రస్ట్ సభ్యులు బాలయ్యతో పంచుకున్నారు.

  • Loading...

More Telugu News