: కేసీఆర్ లా నేను అక్రమాస్తులు సంపాదించలేదు: పొన్నాల


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మరోసారి ఫైర్ అయ్యారు. 'నీతిలేని రాజకీయ నేత కేసీఆర్' అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ ను కేసీఆర్ వ్యాపార సంస్థగా మార్చేశారని ఆరోపించారు. ఎప్పుడూ అబద్దాలు చెప్పే కేసీఆర్ కూడా అప్పుడప్పుడు నిజాలు మాట్లాడతారని... తనను ఆయన గరీబోడు అన్నారని... ఆయన మాటలతో తాను ఏకీభవిస్తున్నానని అన్నారు. కేసీఆర్ చెప్పినట్టు తాను గరీబోడినేనని... కేసీఆర్ లా తాను అక్రమాస్తులు కూడబెట్టలేదని... క్రికెట్ బుకీలతో చేతులు కలపలేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News