: ఫరూక్ అబ్దుల్లా సభలో బాంబు పేలుడు
జమ్మూకాశ్మీర్లో కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్న సభలో బాంబు పేలుడు జరిగింది. శ్రీనగర్ లోని ఖన్యావర్ లో ఈ ఉదయం 11గంటలకు జరిగిన బాంబు పేలుడులో 9 మందికి గాయాలయ్యాయి. మరోవైపు బుధ్ గామ్ జిల్లాలోని మాగమ్ లోనూ బాంబు పేలుడు సంభవించింది. ఇక్కడకు అబ్దుల్లా రావడానికి ముందే ఇది జరిగింది. ఈ ఘటనలో 15 మంది వరకు గాయపడ్డారు. బాంబు పేలుళ్లకు పాల్పడిన వారు ఉగ్రవాదులే అయి ఉంటారని భావిస్తున్నారు.