: మహిళా సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది: విజయశాంతి


తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మహిళను చూడాలని వుందని... రాష్ట్ర పర్యటన సందర్భంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ఆకాంక్షను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న విజయశాంతి స్పందించారు. మహిళా సీఎం ఎవరనే విషయం పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని తెలిపారు. రాహుల్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ గొప్పదనాన్ని వెల్లడిస్తున్నాయని చెప్పారు. మెదక్ ఎంపీగా తాను చేసిన పనులే తనను గెలిపిస్తాయని అన్నారు.

  • Loading...

More Telugu News