: పవన్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు: సీపీఎం


టీడీపీ, బీజేపీ కూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని సీమాంధ్ర సీపీఎం కార్యదర్శి పి.మధు ఆరోపించారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీ తరపున పవన్ ప్రచారం చేయడం అర్థరహితమని అన్నారు. సీపీఎం నేత రాఘవులుతో కలసి మధు ఈ రోజు మంగళగిరిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీపీఐపై నిప్పులు చెరిగారు. ఎర్రజెండా కప్పుకుని సీపీఐ కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సీపీఐకి మంగళగిరిలో పోటీ చేసే నైతికత లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీతో జతకట్టి ఖమ్మంలో తమ అభ్యర్థులను ఓడించేందుకు సీపీఐ ప్రయత్నిస్తోందని... అందుకే తాము వైఎస్సార్సీపీతో కలిశామని చెప్పారు.

  • Loading...

More Telugu News