: తిరుమలేశుని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
తిరుమల శ్రీవారిని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు గవర్నర్ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వరాహస్వామివారిని కూడా దర్శించుకున్న గవర్నర్ దంపతులు శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర జలాలతో ప్రోక్షణం చేసుకున్నారు.