: వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ...రోడ్డుపై బైఠాయించిన గల్లా అరుణ
చిత్తూరు జిల్లా సామిరెడ్డిపల్లెలో వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. చిత్తూరు జిల్లా పాకాల మండలం సామిరెడ్డిపల్లెలో ఎన్నికల ప్రచారానికి మాజీ మంత్రి, టీడీపీ నేత గల్లా అరుణ కుమారి ప్రచారానికి వెళ్లారు. దీంతో ఆమె వాహనాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వారిని టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. దీంతో ఆమె రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో మాటామాటా పెరిగి ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.