: ఆళ్లగడ్డలో విజేతను ఎలా నిర్ణయిస్తామంటే...: భన్వర్ లాల్


ఆళ్లగడ్డలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభానాగిరెడ్డి హఠాన్మరణంతో అక్కడి విజేతను ఎలా నిర్ణయిస్తారన్న దానిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ స్పష్టత ఇచ్చారు. అక్కడ వైఎస్సార్ సీపీ తరపున మరో అభ్యర్థిని నిలబెట్టే అవకాశం లేదని ఆయన అన్నారు. ఇప్పటికే బ్యాలెట్ పేపరును, అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేశామన్నారు. శోభానాగిరెడ్డికి వేసే ఓటు పనికిరాదన్నారు. ఆళ్లగడ్డలో ఫ్యాన్ గుర్తుకి వేసే ఓటును ‘నోటా’గానే పరిగణిస్తామని భన్వర్ లాల్ స్పష్టం చేశారు. ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి మినహా మిగిలిన వారిలో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తే, వారిని విజేతగా ప్రకటించడం జరుగుతుందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News