: రాష్ట్రం విడిపోవడం వల్ల లాభమే: చిరంజీవి
రాష్ట్రం విడిపోవడం వల్ల లాభమే జరిగిందని కేంద్ర మంత్రి చిరంజీవి తెలిపారు. విజయవాడలో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ఆన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పార్టీని వీడడం వల్ల పార్టీకి నష్టం కలుగకపోగా, కొత్త వారికి అవకాశం లభించిందని చిరంజీవి తెలిపారు. కిరణ్ కు తన గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు. సీమాంధ్ర ఉద్యమానికి ఆజ్యం పోసింది కిరణ్ కుమార్ రెడ్డేనని మండిపడ్డారు. విభజన విషయం గోప్యంగా ఉంచి అందరినీ మభ్యపెట్టారని చిరు ఆరోపించారు.