: సీమాంధ్రని తిట్టడం కాదు...తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలి: కేసీఆర్ కు సుష్మా సలహా


ఎంతసేపూ సీమాంధ్రను తిట్టడం కాదని, తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారో ప్రజలకు చెప్పాలని కేసీఆర్ కు బీజేపీ నేత సుష్మాస్వరాజ్ హితవు పలికారు. వరంగల్ జిల్లా హన్మకొండ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్న ప్రస్తుత తరుణంలో సీమాంధ్రను ఆడిపోసుకోవాల్సిన అవసరం లేదని, అలా చేయడం వల్ల సాధించేది ఏమీ లేదని అన్నారు.

కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి సాధికారత కల్పించే దిశగా బీజేపీ కృషి చేస్తుందని ఆమె హామీ ఇచ్చారు. అయితే ప్రజలు విచక్షణతో బీజేపీ, టీడీపీ కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News