: మా కుటుంబానికి అమేథీ పవిత్ర స్థలం: ప్రియాంకా గాంధీ
అమేథీని తమ కుటుంబం పవిత్ర స్థలంగా భావిస్తుందని ప్రియాంకా గాంధీ అన్నారు. అమేథీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అమేథీ తమ కర్మ భూమి అని అన్నారు. బయటి వ్యక్తులను ఎన్నుకోవద్దని ఆమె పిలుపునిచ్చారు. తన తండ్రి రాజీవ్ గాంధీలానే తన సోదరుడు రాహుల్ గాంధీ కూడా గొప్ప దార్శనికుడని ఆమె తెలిపారు. గతంలో తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె గుర్తుచేశారు. ఇక్కడి అభివృద్ధిపై విమర్శలు చేస్తున్న స్మృతి ఇరానీ గత ఎన్నికల్లో చాందినీ చౌక్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారని, పోటీ చేసిన నాటి నుంచి నేటి వరకు ఆమె ఆ నియోజకవర్గం ముఖం చూడలేదని ప్రియాంక దుయ్యబట్టారు.