: మన్మోహన్ తమ్ముడు బీజేపీలో చేరితే లేనిది... నా తమ్ముడు చేరితే వచ్చిందా?: చిరంజీవి
తన తమ్ముడు పవన్ కల్యాణ్ ఎన్డీఏ పక్షాన చేరడంపై కేంద్ర మంత్రి చిరంజీవి స్పందించారు. "ప్రధాని మన్మోహన్ తమ్ముడు బీజేపీలో చేరితే లేనిది... నా తమ్ముడు వేరే పార్టీతో చేయి కలిపితే తప్పేంటి" అని ప్రశ్నించారు. ఎవరి ఇష్టాయిష్టాలను బట్టి వారు నిర్ణయం తీసుకునే హక్కు తమ కుటుంబంలో ఉందని చెప్పారు. ఎన్నికల్లో గెలవలేనన్న భయంతోనే జేఎస్పీ అధినేత కిరణ్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారని ఎద్దేవా చేశారు.