: టీఆర్ఎస్ టిక్కెట్లను అమ్ముకుంది: పవన్ కల్యాణ్
టీఆర్ఎస్ పార్టీపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శల వర్షం కురిపించారు. టీఆర్ఎస్ అమ్ముడుపోయిన పార్టీ అని పవన్ అభివర్ణించారు. ఒక్కో ఎంపీ సీటుకు రూ.30 కోట్ల చొప్పున టీఆర్ఎస్ వసూలు చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ ప్రచారంలో స్పీడును పెంచారు. ఆయన తెలంగాణలో టీడీపీ-బీజేపీ కూటమి తరపున ప్రచారం చేస్తున్నారు.
ఇవాళ కరీంనగర్ లో జరిగిన రోడ్ షోలో పవన్ పాల్గొని ప్రసంగించారు. జాతీయ నేతల్ని టీఆర్ఎస్ విమర్శించడం సరికాదని ఆయన హితవు పలికారు. అసలు జాతీయ నేతల్ని విమర్శిస్తే తెలంగాణ పునర్నిర్మాణం ఎలా జరుగుతుందని పవన్ ప్రశ్నించారు.