: శంకర్రావు వ్యవహారంలో పొలీసులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ తాఖీదు
ఎమ్మెల్యే శంకర్రావు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విచారణకు ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. శంకర్రావును అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని మాల సంక్షేమ సంఘం నేతలు ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసారు. దీనిపై విచారించి 30 రోజుల్లోగా తమకు నివేదిక అందజేయాలని సైబరాబాద్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కమిషన్ ఆదేశించింది.