: అంత ప్రేమ ఉంటే సీమాంధ్రలో కూడా బీసీని ముఖ్యమంత్రిని చేయండి: రాఘవులు
తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీలను ముఖ్యమంత్రిని చేస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. బీసీలపై అంత ప్రేమ ఉంటే సీమాంధ్రలో కూడా బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు వరంగల్ జిల్లా జనగామలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. జనగామ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పొన్నాల లక్ష్మయ్య ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. పోలవరానికి జాతీయ హోదా కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్లను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.