: సీఎంగా ఉన్న వ్యక్తి దుష్ప్రచారం వల్లే కాంగ్రెస్ పై అపోహలు: చిరంజీవి
సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ చిరంజీవి దూసుకుపోతున్నారు. ఈ మేరకు విజయవాడలో ఉన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దుష్ప్రచారం చేయడం వల్లే కాంగ్రెస్ పై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయన్నారు. అయితే, తమ పార్టీపై సీమాంధ్రుల్లో అభిమానం ఉందని చిరు చెప్పారు. మరో పదేళ్లలో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం జరుగుతుందని, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని పేర్కొన్నారు. విభజన తర్వాత జరిగే అభివృద్ధిపై ప్రజలు ఇప్పుడిప్పుడే వివరాలు తెలుసుకుంటున్నారని తెలిపారు. సీమాంధ్రుల్లో భయాందోళనలు, భావోద్వేగాలు అక్కర్లేదని చిరంజీవి భరోసా ఇచ్చారు.