: కాంగ్రెస్, టీఆర్ఎస్ లను ఓడించండి: జయప్రద


రాష్ట్రాన్ని దోచుకున్న కాంగ్రెస్ పార్టీ, అధికారం కోసం వెంపర్లాడే టీఆర్ఎస్ లను ఈ ఎన్నికల్లో ఓడించాలని సినీ నటి, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) పార్టీ నాయకురాలు జయప్రద అన్నారు. ప్రచారంలో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లా ఆలేరులో ఆర్ఎల్డీ నిర్వహించిన రోడ్ షోలో ఆమె పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటులో ఆర్ఎల్డీ క్రియాశీలకపాత్ర పోషించిందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. సామాజిక తెలంగాణ తమ పార్టీతోనే సాధ్యమని జయప్రద చెప్పారు. భువనగిరి లోక్ సభ అభ్యర్థి కపిలవాయి దిలీప్ కుమార్, ఆలేరు అసెంబ్లీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ లను గెలిపించాలని ఆమె కోరారు.

  • Loading...

More Telugu News