: తిరుమలకు పోటెత్తిన భక్తులు
కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమలకు భక్తులు పోటెత్తారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. తిరుమలేశుని దర్శనానికి వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కాలి నడకన వచ్చే భక్తుల దివ్య దర్శనానికి దాదాపుగా 10 గంటల సమయం పడుతోంది. ఇక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 10 గంటల సమయం పడుతోంది.