: స్టాండింగ్ కమిటీల్లో 47 ఉద్యోగాల ప్రకటన
2013 బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ తరహాలో శాసనసభలోనూ స్థాయి సంఘాలు నెలకొల్పిన సంగతి విదితమే. ఇప్పుడు ఆయా సంఘాల్లో పనిచేసేందుకుగాను సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటన జారీచేసింది. మొత్తం 47 పోస్టుల భర్తీకి పిలుపునిచ్చింది. ఇందులో ఒక జాయింట్ సెక్రటరీ, ఒక డిప్యూటీ సెక్రటరీ, 3 అసిస్టెంట్ సెక్రటరీలు, 6 సెక్షన్ ఆఫీసర్లు, 12 రిపోర్టర్లు, 12 రిసోర్స్ ఆఫీసర్లు, మరో 12 డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి.