: మొరాయించిన హెలికాప్టర్... పవన్ సభ రద్దు


షెడ్యూల్ ప్రకారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు కరీంనగర్ జిల్లా గోదావరిఖని సభలో ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ నేపథ్యంలో, ఆయన సభకు హాజరుకాలేకపోయారు. దీంతో, ఆయన ఫోన్ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రచారానికి రావాల్సి ఉన్నా ఇబ్బందుల మూలంగా రాలేకపోయానని, తనను క్షమించాలని కోరారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News