: ఎన్నికల వేళ... ఏరులై పారుతోన్న మద్యం
ఎన్నికల వేళ... మద్యం ఏరులై పారుతోంది. తాజాగా విజయనగరం జిల్లాలో ఓటర్లకు పంచిపెట్టేందుకు దాచి ఉంచిన మద్యం నిల్వలు బయటపడ్డాయి. కొత్తవలస మండలంలోని రాజువానిపాలెంలో బావిలో దాచిన 900 మందు బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ మద్యం నిల్వలు ఏ పార్టీ అభ్యర్థికి సంబంధించినవన్న విషయం ఇంకా తెలియరాలేదు.