: తెలంగాణ కాంగ్రెస్ నేతల గుండె గుభేలు మనిపించిన హెలికాప్టర్
ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ లో హెలికాప్టర్ తెలంగాణ కాంగ్రెస్ నేతల గుండె గుభేలు మనిపించింది. ల్యాండింగ్ సందర్భంగా హెలిపాడ్ ను గుర్తించడంలో పైలట్ విఫలమయ్యాడు. దీంతో 20 నిమిషాలపాటు హెలికాప్టర్ గాలిలోనే చక్కర్లు కొట్టింది. దీంతో టీకాంగ్ నేతలు భయపడ్డారు. ఎట్టకేలకు హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో నేతలు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.