: తనపై దాడి చేశారంటూ పోలీసులకు జయసుధ ఫిర్యాదు
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కాంగ్రెస్ అభ్యర్థి జయసుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాదులోని మెట్టుగూడలో ఎన్నికల ప్రచారం చేసేందుకు కారులో వస్తున్న తనపై దాడి చేసేందుకు యత్నించారని ఆమె తెలిపారు. దాంతో, పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు ఆమె కారు డ్రైవర్ పై చేయి చేసుకున్న వైసీపీ నేతను కూడా పోలీసులు అరెస్టు చేశారు.