: ఇక్కడ ఆంధ్రా ఉద్యోగులు ఉండటానికి వీల్లేదు: దేవీప్రసాద్
తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగులు ఉండటానికి వీల్లేదని టీఎన్జీవో రాష్ట్రాధ్యక్షుడు దేవీప్రసాద్ తేల్చి చెప్పారు. వరంగల్ నగరానికి వచ్చిన దేవీప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగుల విభజనకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామస్థాయి నుంచి సచివాలయం వరకూ ఉద్యోగులను విభజించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమం మాదిరి మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని దేవీప్రసాద్ అన్నారు.