: అనంతపురం జిల్లాలో షర్మిల ‘షో’ చేశారు
అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా జిల్లాలోని ఓబులదేవర చెరువు రోడ్ షోలో పాల్గొన్న షర్మిల చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తొమ్మిదేళ్ల పాలనలో బాబు రైతుల రుణమాఫీ గురించి ఒక్కసారి అయినా ఆలోచించారా? అని ఆమె ప్రశ్నించారు. వైఎస్ పథకాలనే ఇప్పుడు బాబు అమలు చేస్తానంటున్నారని ఆమె ఆరోపించారు. బాబు వ్యవహారం చూస్తుంటే పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టుగా ఉందని షర్మిల వ్యాఖ్యానించారు. జగనన్నకు ఒక్క అవకాశం ఇస్తే ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని షర్మిల చెప్పుకొచ్చారు.